AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Phani CH
|

Updated on: Mar 05, 2026 | 10:03 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25% గా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. 7.8 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మిగులు నిధులతో భారం భరిస్తారు. క్రియారహిత ఖాతాలకు వడ్డీ వర్తించదు. వన్-టైమ్ అమ్నెస్టీ, డిజిటల్ ప్రక్రియలతో సహా పలు సంస్కరణలను బోర్డు ఆమోదించింది. ఇది భవిష్య నిధి భద్రతను పెంపొందిస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 7.8 కోట్లకు పైగా ఉద్యోగుల భవిష్య నిధి చందాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 239వ సమావేశంలో ఈ కీలక తీర్మానం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే పీఎఫ్ వడ్డీ రేటే అత్యధికంగా ఉండటం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ఓపై రూ.944 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, గతేడాది ఉన్న రూ.5,480 కోట్ల మిగులు నిధులతో ఆ నష్టాన్ని భర్తీ చేయనున్నారు. తద్వారా మరో రెండు మూడేళ్ల పాటు చందాదారులకు స్థిరమైన రాబడిని అందించే సామర్థ్యం సంస్థకు ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, 36 నెలలుగా ఎటువంటి జమ లేని ‘ఇన్‌యాక్టివ్’ ఖాతాలకు మాత్రం వడ్డీ లభించదు. ఈ సమావేశంలో వడ్డీ రేటు నిర్ణయంతో పాటు పలు కీలక సంస్కరణలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను గుర్తింపు పొందిన ట్రస్టుల సమస్యల పరిష్కారానికి ‘వన్-టైమ్ అమ్నెస్టీ స్కీమ్’ను ప్రకటించింది. దీని కింద జరిమానాలపై మినహాయింపులతో ఆరు నెలల గడువు ఇచ్చారు. దీనివల్ల 100కు పైగా వ్యాజ్యాలు పరిష్కారమవుతాయని అంచనా. అలాగే, ఈపీఎఫ్ మినహాయింపుల కోసం సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రక్రియలను డిజిటలైజ్ చేసి, భారాన్ని తగ్గించనున్నారు. దీంతో పాటు సామాజిక భద్రతా కోడ్ 2020 కింద కొత్త పథకాలు, క్రియారహిత ఖాతాల్లో క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా ప్రారంభించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?

Follow Us