AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ భారీగా బంగారం నిల్వలు.. పసిడి ధరలు పడిపోతాయా?

అక్కడ భారీగా బంగారం నిల్వలు.. పసిడి ధరలు పడిపోతాయా?

Phani CH

|

Updated on: Apr 12, 2025 | 12:07 PM

ఒడిశాలోని అనేక ప్రాంతాలలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఆ రాష్ట్రం బంగారం తవ్వకాలకు కేంద్రంగా మారింది. దీని కారణంగా మన దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని, సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు.

ఒడిశాలోని సుందర్ గఢ్, నబరంగ్ పూర్, కియోంఝర్, డియోగఢ్ జిల్లాలలో పసిడి నిక్షేపాలను గుర్తించారు. బౌధ్, మల్కాన్ గిరి, సంబల్ పూర్ జిల్లాలలో కూడా అన్వేషణ కొనసాగుతోంది. వీటితో పాటు మారేదిహి, సులేపట్, బాదంపహాడ్ తదితర ప్రాంతాలలో ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో గుర్తించిన అడసా – రాంపల్లి నిల్వల కంటే ఇవి భారీగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో రాగి కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వేషిస్తోంది. ఒడిశా ప్రభుత్వం, జీఎస్ఐ, మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కియోంఘర్ జిల్లాలోని గోపూర్ – ఘాజీపూర్, మంకడ్చువాన్, సలేకానా, దిమిరిముండా ప్రాంతాల్లో ప్రయత్నాలు ఆ రాష్ట్ర మైనింగ్ రంగం ప్రగతికి ఉపయోగపడతాయి. ఇక్కడ లభించే బంగారం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది. దేవ్ ఘర్ జిల్లాలో మొట్టమొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఆ రాష్ట్ర మైనింగ్ పరిశ్రమ ప్రగతిలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బంగారు గనులతో ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్‌ తీగలపై మేక విన్యాసాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు

సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్‌

దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు

మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!

వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా ?? జరిగేది ఇదే..