వైట్ రైస్‌కి బదులుగా ఓట్స్ తింటున్నారా ?? జరిగేది ఇదే..
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వైట్ రైస్ కి బదులుగా వివిధ రకాలైన డైట్‌ఫుడ్ తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో ఓట్స్ మొదటి స్థానంలో ఉంటుంది. బరువు తగ్గడంలో ఓట్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో చూద్దాం. ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాయువు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. ఓట్స్‌లో ఉండే ఫైటేట్స్ వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్స్ అందకపోవచ్చు. బరువు తగ్గడానికి ఓట్స్ మంచిదనుకుంటారు.. కానీ తగ్గిన క్యాలరీల కారణంగా శరీరానికి అవసరమైన శక్తి అందకపోవచ్చు. ఓట్స్ తిన్న.. తక్కువ సమయంలోనే మళ్లీ ఆకలి అనిపించేలా చేసి, అధికంగా తినిపించవచ్చు. ప్రతి ఒక్కరి శరీరానికి ఓట్స్ సరిపోకపోవచ్చు. విషేషంగా అలెర్జీ ఉన్నవారు ఓట్స్‌కి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. చాలా కంపెనీలు ఇచ్చే ఓట్స్ ప్రాసెస్డ్ అయి ఉండటం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి డయబెటిక్ పేషెంట్స్‌కి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇకపై అలా కుదరదు..
మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

