మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు
పశ్చిమ బెంగాల్ లోని డోమ్‌కల్‌కు చెందిన నవాబ్ షేక్ అనే యువకుడు రూపొందించిన చక్రాల మంచం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే పోలీసులు అతనికి బిగ్ షాక్ ఇచ్చారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవాబ్ తన భార్య నగలమ్మి రూ.2.15 లక్షలకు పైగా వెచ్చించి ఏడాదికి పైగా శ్రమించి ఈ చక్రాల మంచాన్ని రూపొదించాడు.
ఇప్పుడది పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆ దంపతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిరీత్యా పూల్ కార్ డ్రైవర్ అయిన నవాబ్ షేక్, సాధారణ వాహనంలా నడిపే వీలున్న ఒక ప్రత్యేకమైన మంచం బండిని రూపొందించాడు. 5×7 అడుగుల పరుపులు, దిండ్లు, స్టీరింగ్ వీల్, వెనుక అద్దాలు, బ్రేక్ సిస్టమ్‌తో సహా డ్రైవర్ సీటు తో ఈ కారును తయారుచేశాడు. అంతటితో ఆగకుండా ఆ కారులో రోడ్డుపై చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాడు. రాణీనగర్ మరియు డోమ్‌కల్ మధ్య ఈ ‘చక్రాల మంచం’ తిరుగుతుండటంతో భారీగా జనం గుమిగూడుతున్నారు, దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తనకు 1.5 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని నవాబ్ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ కావడం తన కల అని అందుకే ఈ కారు తయారుచేశానని చెప్పాడు. దీనికోసం ఒక ఇంజిన్, స్టీరింగ్, ఇంధన ట్యాంక్, ఒక చిన్న కారు బాడీ విడిభాగాలను స్థానిక వర్క్‌షాప్ నుండి కొనుగోలు చేశానని, ఓ వడ్రంగితో చెక్క మంచం తయారుచేయించానని, అందుకు రూ. 2.15 లక్షలు ఖర్చు అయిందని తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

