రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇకపై అలా కుదరదు..
భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి లగేజీ ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రైల్లో ప్రయాణికులు తీసుకువెళ్లే లేగజీపై పరిమితి విధించాలని నిర్ణయించింది. ఆ మేరకు భారత రైల్వే శాఖ కొత్తరూల్స్ తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లే లగేజీపై రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మోసుకెళ్లేది మేమే కదా అని ఇష్టారీతిన లగేజీ తీసుకెళ్లడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలో కూడా లగేజీకి చార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కేజీలు, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ ప్రయాణికులు తమ వెంట 40 కేజీల లగేజీని వెంట తీసుకెళ్లవచ్చునని రైల్వే శాఖ తెలిపింది. అనుమతించిన బరువు కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టికెట్ రేటు కంటే ఈ జరిమానా ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

