అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
మనుషులు చేసే కొన్ని పొరపాట్ల వల్ల సృష్టిలోని మూగజీవాలు శిక్ష అనుభవిస్తున్నాయి. మనం విచ్చలవిడిగా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందుకు మరో ఉదాహరణే..ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జరిగిన ఈ ఘటన. పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కొందరు భక్తులు ఆహారం తీసుకొస్తున్న ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు జంతువులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి.
మనుషులు చేసే కొన్ని పొరపాట్ల వల్ల సృష్టిలోని మూగజీవాలు శిక్ష అనుభవిస్తున్నాయి. మనం విచ్చలవిడిగా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందుకు మరో ఉదాహరణే..ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జరిగిన ఈ ఘటన. పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కొందరు భక్తులు ఆహారం తీసుకొస్తున్న ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు జంతువులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ద్వారకాతిరుమల కొండపై సంచరించే ఒక శునకం, అక్కడ పడి ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం కోసం తల దూర్చింది. అయితే, లోపల ఉన్న ఆహారాన్ని తినే క్రమంలో తలను మరింత లోపలికి పెట్టడంతో, ఆ డబ్బాలో కుక్క మెడ ఇరుక్కుపోయింది. అది ఎంత ప్రయత్నించినా తల బయటకు రాకపోవడంతో, తలకు హెల్మెట్ పెట్టుకున్నట్లుగా ఆ డబ్బాతోనే కొండపై అటూ ఇటూ తిరుగుతూ ఆర్తనాదాలు చేయడం మొదలుపెట్టింది. గాలి ఆడక, ఆహారం తీసుకోలేక ఆ కుక్క పడుతున్న అవస్థలను చూసి అక్కడి భక్తులు చలించిపోయారు. దానిని పట్టుకోవడం కూడా కష్టంగా మారినప్పటికీ, కొందరు సాహసించి ఆ శునకాన్ని బంధించారు. ఒకరు కాళ్లు పట్టుకోగా, మరొకరు చాకచక్యంగా ఆ ప్లాస్టిక్ డబ్బాను బలవంతంగా లాగి బయటకు తీశారు. ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో ఆ కుక్క కృతజ్ఞతగా వారిపైపు చూసి, అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ దృశ్యాలను చూసిన భక్తులు ఆశ్చర్యపోవడమే కాకుండా, ప్లాస్టిక్ వినియోగం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కంటైనర్లలో తెచ్చి, వాటిని రోడ్లపై పారేయడం వల్ల ఇలాంటి విచారకర సంఘటనలు జరుగుతున్నాయని, ప్లాస్టిక్ పట్ల అందరూ బాధ్యతగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

