AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 12:19 PM

Share

వనపర్తి జిల్లా మూలమల్ల గ్రామంలో రైతులు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా చెరువు కట్టపై భారీ మొసలి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. కృష్ణా నది నీటిమట్టం తగ్గడంతో జూరాల ప్రాజెక్టు నుండి మొసళ్లు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. మొసళ్లను బంధించి, చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చీకటి పడ్డాక పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న రైతులకు మార్గమధ్యలో ఊహించని దృశ్యం ఎదురైంది. మరో రెండడుగుల దూరం ప్రయాణిస్తే ఇంటికి చేరుకుంటామన్న తరుణంలో.. చెరువు కట్టపై భయానక దృశ్యం కనిపించడంతో రైతులు ప్రాణభయంతో తలోదిక్కూ పరుగులు తీశారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం మూలమల్ల గ్రామంలో గత రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో, జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుండి మొసళ్లు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ముఖ్యంగా మూలమల్ల గ్రామ చెరువు ఇప్పుడు మొసళ్లకు నిలయంగా మారింది. గత రాత్రి గ్రామస్థులు పొలం పనులు ముగించుకుని చెరువు కట్టమీదుగా ఇంటికి వెళ్తున్నసమయంలో వారికి భారీ మొసలి ఎదురైంది. మొదట భయంతో దూరంగా పరుగులు తీసిన వారు.. దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో మొసలి సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు చేశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ మొసలి ఎంత భారీగా ఉందో అర్థమవుతోంది. కేవలం చెరువుల్లోనే కాకుండా, పంట పొలాల్లో, వ్యవసాయ బావుల్లో కూడా ఇవి తిష్ట వేస్తుండటంతో రైతులు పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మొసళ్ల సంచారం ఎక్కువైపోయింది. గతంలో కొన్నింటిని పట్టుకుని అధికారులు జూరాల ప్రాజెక్టులో విడిచిపెట్టినప్పటికీ, మరికొన్ని ఇంకా చెరువుల్లోనే తిరుగుతున్నాయి. తాజాగా మూలమల్ల చెరువులో కనిపిస్తున్న మొసలిపై అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసళ్లను బంధించాలని, ఊరి చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేకువజామున, రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా

భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..

అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !

గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

Follow Us