గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..
సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌లో తేనెటీగల బీభత్సం సృష్టించాయి. తీవ్ర వేడిమి కారణంగా పురాతన మర్రిచెట్టు తేనెటీగలు గ్రామస్థులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాదకరమైన తేనెతుట్టను తక్షణమే తొలగించాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల సమీపంలో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. ఊహించని రీతిలో తేనెటీగలు దండుగా విరుచుకుపడటంతో గ్రామస్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో సుమారు 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం.. వెంకటాపూర్ పాఠశాల సమీపంలోని ఓ పురాతన మర్రిచెట్టుపై భారీ తేనెతుట్ట ఉంది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు ఎండ వేడిమి పెరగడంతో, వేడికి తాళలేక ఆ తేనెటీగలు ఒక్కసారిగా చెలరేగిపోయాయి. దారి వెంట వెళ్తున్న వారు, ఇళ్ల ముందు కూర్చున్న వారిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో సుధాకర్ అనే యువకుడిపై వేల సంఖ్యలో తేనెటీగలు ముసిరి కుట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు బాధితులందరినీ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 14 మందికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన పాఠశాలకు సమీపంలోనే జరిగినప్పటికీ, తేనెటీగలు స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యార్థులపై దాడి చేసి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ ప్రమాదకరమైన తేనెతుట్టను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

