AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 11:44 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఒక మైనర్ బాలిక పెళ్లి రోజున ఇద్దరు వరులు రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. బాల సంక్షేమ అధికారులు జోక్యం చేసుకుని బాలికను రక్షించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో నిశ్చితార్థం రద్దు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లీకూతుళ్లు విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు సమాజంలో బాల్య వివాహాలు, సంబంధాల ఒత్తిళ్లపై తీవ్ర చర్చకు దారితీశాయి.

ఉత్తర ప్రదేశ్‌లో మైనర్ బాలిక పెళ్లి రోజు ఊహించని మలుపు తిరిగింది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్‌తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. షామ్లీకి చెందిన ఓ యువకుడికి ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో పెళ్లి కుదిరింది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. వరుడి కుటుంబం బరాత్‌తో పెళ్లి కూతురి ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఊహించని షాక్ తగిలింది. మీరట్‌కు చెందిన యువకుడి ఫ్యామిలీ కూడా అదే బాలికతో పెళ్లి కోసం బరాత్‌తో ఆమె ఇంటికి వచ్చింది. పెళ్లి కూతురి కోసం రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఆ బాలికకి తమ అబ్బాయితో పెళ్లి ఫైనల్ అయిందని షామ్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ అంది. మీరట్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కూడా ఇదే విషయం చెప్పింది. గ్రామస్థులు కలుగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. గొడవ ఆగకపోగా మరింత పెద్దదైంది. దీంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపారు. పెళ్లి కూతురు మైనర్ అని తెలియటంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పెళ్లి కూతురు మైనర్ అని ధ్రువీకరించుకున్న తర్వాత వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో జరిగింది. యువకుడు తాను హైదరాబాదులో దివ్య ను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఆమె తల్లికి చూపించి దివ్య తీరు బాలేదని పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి కుమార్తెలు ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుగోలు చేసి తాగి పడుకున్నారు .మార్చి 5న అపస్మారక స్థితిలో ఉన్న దివ్య సుజాతలను గమనించిన దివ్య తండ్రి శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆసుపత్రికి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారం రోజులు చికిత్స పొందిన సుజాత, దివ్య ల ఆరోగ్య పరిస్థితి మార్చి 13న విషమంగా మారింది . గురువారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివ్య మృతి చెందగా 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత ఆసుపత్రిలోనే మరణించింది . దివ్య తండ్రి శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు …

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!

Follow Us