AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!

పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 11:38 AM

Share

వేసవిలో తీయని పుచ్చకాయ కోసం చూస్తున్నారా? వందల కాయల్లో ఏది తీపిగా ఉందో గుర్తించడం కష్టం. పండిన పుచ్చకాయను ఎంచుకోవడానికి దాని మెరుపు, 'ఫీల్డ్ స్పాట్' రంగు, ఆకారం, బరువు, నెట్ లాంటి గీతలు, కాడ వంటి ముఖ్య లక్షణాలను గమనించాలి. డబ్బు వృథా కాకుండా, అత్యంత రుచికరమైన, తీపి పుచ్చకాయను ఎలా ఎంచుకోవాలో ఈ చిట్కాలు మీకు స్పష్టంగా తెలియజేస్తాయి.

వేసవిలో పుచ్చకాయ ముక్కలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే, మార్కెట్‌కు వెళ్లినప్పుడు వందల కాయల్లో ఏది తీయగా ఉంటుందో, ఏది పాడై పోయిందో కనిపెట్టడం కష్టం. పుచ్చకాయ‌పైన చూడటానికి ఎర్రగా కనిపించినా, తీరా కోసిన తర్వాత తెల్లగా ఉంటే డబ్బులు వృథా. పుచ్చకాయ కొనేటప్పుడు ఈ కింది విషయాలను తప్పక గమనించండి.

1. మెరుపును చూసి మోసపోకండి. చాలామంది పండు మెరుస్తూ ఉంటే అతి తాజాగా ఉందని అనుకుంటారు. కానీ, పుచ్చకాయ విషయంలో అది తప్పు. బాగా పండిన పుచ్చకాయ మెరుపు లేకుండా ఉంటుంది. పండు మెరుస్తోందని అంటే అది ఇంకా పచ్చిగా ఉందని అర్థం.

2. పుచ్చకాయ నేలపై పడి ఉన్నప్పుడు ఒక వైపు సూర్యరశ్మి తగలదు. ఆ భాగాన్ని ‘ఫీల్డ్ స్పాట్’ అంటారు. ఆ మచ్చ నారింజ-పసుపు రంగులో ఉంటే అది తీయగా ఉందని అర్థం. ఒకవేళ అది తెల్లగా ఉంటే ఆ కాయ ఇంకా పండలేదని అర్థం.

3. పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఆకారాన్ని గమనించాలి. పాడవుగా ఉన్నవాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. గుండ్రంగా ఉన్నవి చాలా తీయగా ఉంటాయి, మీకు తీపి కావాలంటే గుండ్రటి కాయను తీసుకోండి.

4. ఒకే పరిమాణంలో ఉన్న రెండు కాయలను చేతిలోకి తీసుకున్నప్పుడు, ఏది ఎక్కువ బరువు ఉంటే దాన్ని తీసుకోండి. బరువు ఎక్కువగా ఉంటుందంటే అందులో గుజ్జు, రసం సమృద్ధిగా ఉన్నాయని అర్థం.

5. కాయపైన గోధుమ రంగులో నెట్ లాంటి గీతలు కనిపిస్తే.. ఆ పండును అస్సలు వదలకండి. ఆ గీతలు ఎక్కువగా ఉంటే, ఆ పండు అంత తీయగా ఉంటుందని అర్థం. పిందెగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కువగా వాలడం వల్ల ఆ గీతలు ఏర్పడతాయి.

6. పుచ్చకాయకు ఉన్న కాడ పచ్చగా ఉంటే అది చెట్టు నుంచి ముందే కోసేశారని అర్థం. అదే కాడ పూర్తిగా ఎండిపోయి ఉంటే, అది చెట్టు మీద సహజంగా పండిందని, తింటే చాలా రుచిగా ఉంటుందని అర్థం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్

Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి

Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై

సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??

అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?

Follow Us