అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !
ఒంగోలు జిల్లా మత్స్యకారుడు సుబ్రహ్మణ్యానికి ఊహించని ప్రమాదం జరిగింది. బతికున్న చేప ఒకటి అతని గొంతులో ఇరుక్కుపోయి, శ్వాసనాళాన్ని అడ్డుకోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ఈఎన్‌టీ వైద్య బృందం డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో క్లిష్టమైన ట్రాకియాష్టమీ శస్త్రచికిత్స చేసి, చేపను తొలగించి అతని ప్రాణాలను కాపాడింది. వైద్యుల సమయస్ఫూర్తితో ఒకరి ప్రాణాలు నిలిచాయి.
చేప ముల్లు గొంతులో చిక్కుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది.. అలాంటిది ఏకంగా బతికున్న చేపే గొంతులో ఇరుక్కుంటే.. ఇంకేమైనా ఉందా.. సరిగ్గా అలాంటి ఘటనే ఒంగోలు జిల్లాలో జరిగింది. గొంతులో బతికి ఉన్న చేప ఇరుక్కోవడంతో స్థానిక మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం చావు అంచుదాకా వెళ్లి, వైద్యుల పుణ్యమా అని ప్రాణాలతో బయటపడ్డాడు. వృత్తిరీత్యా మత్స్యకారుడైన సుబ్రహ్మణ్యం సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వచ్చాడు. వలలో చిక్కుకున్న చేపలను వేరు చేసే క్రమంలో, వల చివరను నోటితో పట్టుకున్నాడు. అదే సమయంలో వలలో ఉన్న ఒక బతికున్న చేప ఒక్కసారిగా ఎగిరి నేరుగా ఆయన నోటిలోకి వెళ్లి గొంతులో ఇరుక్కుపోయింది. అది అటు కడుపులోకి వెళ్లక, ఇటు బయటకు రాక గొంతులోనే అటూ ఇటూ కదులుతూ కొద్దిసేపటికే ఆ చేప చనిపోయింది. అది శ్వాసనాళానికి అడ్డంగా ఉండటంతో సుబ్రహ్మణ్యం ఊపిరి ఆడక విలవిల్లాడిపోయాడు. మత్స్యకారుడి కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ENT విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య బృందం రంగంలోకి దిగింది. గంటపాటు శ్రమించి, అత్యంత క్లిష్టమైన ‘ట్రాకియాష్టమీ’ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి, గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. ప్రాణాపాయం నుంచి సుబ్రహ్మణ్యాన్ని రక్షించిన డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, అర్జున్, లాలస బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..
గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

