AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 12:14 PM

Share

కడప జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ కలహాలు దారుణంగా మారాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన భార్య కృష్ణవేణిని ఆపకుండా, భర్త శ్రీనివాసులు ఉరి ఎలా వేసుకోవాలో సూచించి, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. భార్య ప్రాణాలు విడిచినా అతడిలో కనీసం చలనం లేదు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. ఎవరో ఒకరు తగ్గితే గొడవ సద్దుమణుగుతుంది.. కానీ ప్రస్తుత కాలంలో ఎవరూ తగ్గడానికి సిద్ధ పడటంలేదనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలు తియ్యడం.. లేదా తీసుకునేవరకూ వెళ్తున్నాయి. అలాంటి ఘటనే కడపజిల్లాలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్న భార్యను అడ్డుకోవాల్సింది పోయి.. ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి మరీ ప్రోత్సహించాడు ఆ భర్త. ఈ అమానవీయ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో జరిగింది. కళ్లముందే భార్య ప్రాణాలు విడుస్తున్నా.. కనీసం చలనం లేకుండా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించడమే కాకుండా, ఉరి ఎలా వేసుకోవాలో ‘సూచనలు’ ఇచ్చిన ఆ భర్త తీరు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బోయినపల్లికి చెందిన శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి, భార్య కృష్ణవేణికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వివాదం రేగింది. ఈ క్రమంలో మనస్థాపం చెందిన కృష్ణవేణి, భర్తను భయపెట్టడానికో లేదా ఆవేశంలోనో ఆమె గదిలోకి వెళ్లి.. ఉరివేసుకుంటానని ఫ్యాన్ వద్దకు వెళ్లింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా అడ్డుకుంటారు. కానీ శ్రీనివాసులు మాత్రం కనీసం ఆపలేదు. పైగా బయటి కిటికీ దగ్గర నిలబడి.. సెల్‌ఫోన్ . “ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి” అంటూ ఆమెను రెచ్చగొడుతూ వీడియో తీశాడు. భర్త ఆపుతాడని ఆశించిన కృష్ణవేణి, ఆ క్షణికావేశంలో ఉరి బిగించుకుని ప్రాణాలు విడిచింది. ప్రాణం పోతున్నా ఆ భర్తలో మానవత్వం మేల్కొనకపోవడం గమనార్హం. కృష్ణవేణి మరణ వార్త తెలిసిన ఆమె బంధువులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. భర్త ప్రవర్తనపై ఆగ్రహంతో ఊగిపోతూ అతనిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిత్యం వేధింపులకు గురిచేయడమే కాకుండా, కళ్లముందే ఉరివేసుకుంటున్నా కాపాడకుండా ప్రాణం పోవడానికి కారణమైన శ్రీనివాసులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, శ్రీనివాసులు తీసిన వీడియోను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..

అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !

గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు

దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్

Follow Us