ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..
చెన్నై హోటల్‌లో టిఫిన్‌కు అదనంగా 'గ్యాస్ యూసేజ్ ఫీ' వసూలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. వండిన ఆహారానికి గ్యాస్ ఖర్చు విడిగా వసూలు చేయడం వినియోగదారుల హక్కులకు విరుద్ధమని నెటిజన్లు, వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. పౌర సరఫరాల శాఖ తక్షణమే స్పందించి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హోటల్‌కు వెళ్తే మనం ఆర్డర్ చేసిన టిఫిన్‌కు బిల్లు కట్టడం మామూలే. కానీ, ఇకపై ఆ టిఫిన్ వండటానికి వాడిన గ్యాస్‌కు కూడా విడిగా బిల్లు కట్టాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలుగుతోంది. చెన్నైలోని ఓ హోటల్ యాజమాన్యం వేసిన బిల్లు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది. టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా ‘Gas Usage Fee’ వసూలు చేయడంతో కస్టమర్లు నోరెళ్లబెడుతున్నారు. చెన్నైలోని ఒక హోటల్‌కు వెళ్లిన కస్టమర్, టిఫిన్ తిన్న తర్వాత చేతికి వచ్చిన బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో ఇడ్లీ, వడ ధరల కింద అదనంగా ‘గ్యాస్ యూసేజ్ ఫీ’ అని జోడించి ఉంది. “మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి.. మరి వంట చేయడానికి వాడిన గ్యాస్ ఖర్చును విడిగా వసూలు చేయడం ఏంటి?” అని సదరు కస్టమర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. ఆ బిల్లు ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారి చర్చకు దారితీసింది. ఈ వింత బిల్లుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “రేపు హోటల్ ఏసీ గాలికి, కూర్చున్న కుర్చీకి కూడా రెంట్ అడుగుతారేమో!” అని కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఆహార పదార్థాల ధరల్లోనే అన్ని రకాల ఖర్చులు కలిపి ఉండాలి. ఇలా విడిగా వసూలు చేయడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే” అని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు హోటల్ యజమానులు టిఫిన్ ధరలను స్వల్పంగా పెంచుతుంటారు. కానీ ఇలా ‘గ్యాస్ ఫీజు’ అంటూ విడిగా వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అడ్డగోలు వసూళ్లపై పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల రక్షణ విభాగం తక్షణమే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సామాన్యులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..
గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

