అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
రాయికల్, జగిత్యాల జిల్లాలో తల్లి ఉడుత తన బిడ్డను ప్రాణాపాయం నుండి కాపాడిన సంఘటన నెటిజన్లను కదిలించింది. సన్నని కొమ్మపై చిక్కుకున్న తన బిడ్డను రక్షించడానికి తల్లి ఉడుత తన ప్రాణాలను పణంగా పెట్టింది. మాతృప్రేమకు హద్దులు లేవని నిరూపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిడ్డల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే అమ్మ ప్రేమను మరోసారి చాటింది.
అమ్మ అంటేనే త్యాగానికి మరోపేరు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది.. తన బిడ్డలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షణ కవచంలా నిలుస్తుంది. అది కేవలం మనుషులకే పరిమితం కాదు, మూగజీవాల్లోనూ మాతృప్రేమ అపారమని నిరూపించింది ఒక చిన్ని ఉడుత. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ప్రమాదంలో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఉడుత చేసిన సాహసం చూస్తే ఎవరికైనా కదిలించాల్సిందే. రాయికల్ శివారులోని ఒక ఎండిపోయిన చెట్టుపై తల్లి ఉడుత, దాని పిల్ల ఆడుకుంటున్నాయి. ఆ ఆటలో పడి చిన్న ఉడుత అజాగ్రత్తగా ఒక సన్నని ఎండిపోయిన కొమ్మ చివర వరకు వెళ్ళింది. ఆ కొమ్మ ఎంత సన్నగా ఉందంటే.. ఏ క్షణమైనా విరిగి కింద పడిపోయేలా ఉంది. ముందుకు వెళ్లే దారి లేక, వెనక్కి రాలేక ఆ చిన్ని ప్రాణం విలవిలలాడిపోయింది. దూరం నుండి ఇది గమనించిన తల్లి ఉడుత ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. మొదట ఆ సన్నని కొమ్మపైకి వెళ్లేందుకు ప్రయత్నించి, అది విరిగిపోతుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గింది. కానీ, తన బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించిన ఆ తల్లి.. మరుక్షణమే తన ప్రాణాలను పణంగా పెట్టింది. అత్యంత చాకచక్యంగా, ధైర్యంగా ముందుకు దూకి ఆ చిన్ని ఉడుతను నోట కరుచుకుని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. అక్కడే ఉన్న కొందరు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. “అమ్మ ప్రేమకు హద్దులు లేవని, బిడ్డ కోసం ఏ ప్రాణి అయినా ఎంతటి సాహసానికైనా వెనుకాడదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అమ్మతనం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..
గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

