AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

Phani CH
|

Updated on: Mar 16, 2026 | 7:17 PM

Share

యాదాద్రి జిల్లాలో హృదయవిదారక ఘటన. పదో తరగతి పరీక్షకు ముందు తండ్రి మరణించినా, కొడుకు హర్షవర్ధన్ గుండె నిబ్బరంతో పరీక్ష రాశాడు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి కన్నీళ్లు దిగమింగుకుని పరీక్షా కేంద్రానికి వెళ్ళి, తన ధైర్యంతో అందరినీ కదిలించాడు. ఇది మార్కుల కోసం కాదు, తండ్రి కన్న కల కోసం.

కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని ఆ తండ్రి ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. కొడుకు కష్టపడి చదువుతూ తండ్రి ఆశ నెరవేర్చేలా తన భవిష్యత్తుకోసం తండ్రి చూపిన బాటలో నడుస్తున్నాడు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కొడుకును ఆశీర్వదించి పంపించాలనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడవుతున్నాడని మురిసిపోయాడు. కొడుకు ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నాడు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో తెల్లవారితే పరీక్ష అనగా.. రాత్రికే ఆ తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇంటి ముందు తండ్రి మృతదేహం.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఆ వాతావరణంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన కూరేళ్ల ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన పిల్లలను గొప్పగా చదివించాలని తపించేవారు. ఆయన కుమారుడు హర్షవర్ధన్ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షల ఒత్తిడి లేకుండా కొడుకుకు ధైర్యం చెప్పిన ఆ తండ్రికి, రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే నాన్న విగతజీవిగా పడి ఉండటంతో హర్షవర్ధన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ పక్క పుట్టెడు దుఃఖం, మరోపక్క భవిష్యత్తును నిర్ణయించే తొలిమెట్టు. ఆ క్లిష్ట సమయంలో హర్షవర్ధన్ తన తండ్రి ఆశయాన్ని గుర్తుచేసుకున్నాడు. నాన్న ఆత్మకు శాంతి కలగాలంటే తను పరీక్ష రాయడమే సరైన నివాళి అని భావించి, కన్నీళ్లను దిగమింగుకుంటూ పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. పరీక్షా హాల్లో ప్రశ్నపత్రం ముందున్నా, కళ్లలో నాన్న జ్ఞాపకాలు కదలాడుతుండగా ఏడుస్తూనే పరీక్ష పూర్తి చేశాడు.పరీక్ష ముగిసిన అనంతరం ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ బాలుడి ధైర్యాన్ని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. మార్కుల కోసం కాదు, తండ్రి కన్న కల కోసం హర్షవర్ధన్ చూపిన ఈ పట్టుదల ప్రతి ఒక్కరినీ కదిలించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్

‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’

Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి

Follow Us