AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు'

‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’

Phani CH
|

Updated on: Mar 16, 2026 | 7:07 PM

Share

తనూశ్రీ దత్తా సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను బట్టబయలు చేశారు. హీరోయిన్‌గా ఎదగాలని వచ్చే చాలా మంది యువతులు అపరిచితుల ఉచ్చులో చిక్కుకుని, అవకాశాల పేరిట దోపిడీకి గురవుతున్నారని ఆమె ఆరోపించారు. కొందరు విజయం సాధిస్తే, మరికొందరు నిరాశతో వెనుదిరుగుతారు. అయితే కొంతమంది మాత్రం వెనక్కి వెళ్లలేక, ముందుకు సాగలేక వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారనే షాకింగ్ నిజాలను తనూశ్రీ వెల్లడించారు. ఈ నిజాలు చాలామంది అమ్మాయిలకు కనువిప్పు కావాలని ఆమె ఆకాంక్షించారు.

గంపెడాశలతో.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని.. చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. కానీ వాళ్లలో కొంత మంది సక్సెస్ అవుతున్నారు. ఎంత మంది ఫెయిల్యూర్ అయి వెనక్కి వెళిపోతున్నారు. కానీ ఇంకెంత మంది మాత్రం ఎటూ వెళ్లలేక వ్యభిచారంలో మగ్గిపోతున్నారని తనూ శ్రీ దత్తా అంటున్నారు. ఎస్ ! రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌ షోకు వెళ్లిన తనూ శ్రీ.. ఫిల్మ్ ఇండస్ట్రీలోని డార్క్‌ షేడ్‌ను టచ్ చేశారు. హీరోయిన్‌ అవ్వాళనుకునే అమ్మాయిలకు తమ మాటలతో కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. తన చిన్నతనంలో తన తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయంటున్నారు తనూశ్రీ దత్తా. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు పొగుడుతారని.. తర్వాత కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని వాడుకుంటారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారన్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం.. ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటివన్నీ సీక్రెట్ గా నే ఉంటాయని బయటికి రావడని ఆమె చెప్పుకొచ్చారు. అందరికీ బయటికి వచ్చిన సక్సెస్‌ స్టోరీలు మాత్రమే కనిపిస్తాయి. వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారని.. ఆ స్టోరీస్ వినే మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు అమ్మాయిలు క్యూ కడతారని.. ఇందంతా ఓ చైన్ లా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను ఈ విషయాలను వివరించడం వల్ల.. ఓ నలుగురు అమ్మాయిలైనా అలర్ట్‌ అవుతారు కదా అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Published on: Mar 16, 2026 07:07 PM
Follow Us