AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

Phani CH
|

Updated on: Mar 16, 2026 | 6:14 PM

Share

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణం తర్వాత, ఆయన వారసుడు మొజ్తాబా ఆచూకీ తెలియకుండా పోయింది. మొజ్తాబా కీలక సమాచారం అందించిన వారికి అమెరికా $10 మిలియన్ల భారీ రివార్డు ప్రకటించింది. ఇరాన్ ప్రతీకారంగా బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ, దుబాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా తమ తర్వాతి టార్గెట్ వారే అని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా అన్నంత పనీ చేసింది. అమెరికా- ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఎన్నికయ్యారు. యుద్ధం కారణంగా మొజ్తాబా ఇప్పటివరకు బయట కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది అమెరికా. ఆచూకీ ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు అంటే 92 కోట్ల రూపాయలు ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. సుప్రీం నేత ఖమేనీతో పాటు, ఆయన కార్యాలయ డిప్యూటి చీఫ్‌ హెజాజీ, ఇరాన్‌ భద్రతాధికారి లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్‌ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లేదా టోర్‌ నెట్‌వర్క్‌ ద్వారా తెలియజేయాలని తగిన బహుమతి అందిస్తామని తెలిపింది. సమాచారం అందించిన వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది ఇరాన్‌. ఈ ఘటనలో హెలిప్యాడ్‌ ధ్వంసమైంది. క్షిపణి దాడితో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ పదేపదే రాకెట్‌లు, డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. దీనిపై అగ్రరాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దుబాయ్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి దాడి జరగడం పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని దుబాయి మీడియా ఆఫీస్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. శుక్రవారం కూడా దుబాయ్‌లోని ఓ భవనంపై డ్రోన్‌ దాడి జరిగినట్లు మీడియా కథనాలు తెలిపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

Follow Us