AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Phani CH
|

Updated on: Mar 16, 2026 | 5:36 PM

Share

మారుతున్న జీవనశైలిలో రాగి జావ ప్రాధాన్యత పెరుగుతోంది. కాల్షియం, ఐరన్, పీచుతో నిండిన ఈ చిరుధాన్యం అద్భుత ఆరోగ్య ప్రయోజనాలనిస్తుంది. ప్రేగు ఆరోగ్యానికి ప్రీబయోటిక్‌గా, బరువు తగ్గడానికి, పిల్లల ఎదుగుదలకు ఇది మేలు. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం మోతాదులో తీసుకోవాలి. తక్షణ శక్తిని, చలువను ఇచ్చే రాగి జావను సులువుగా తయారుచేసుకోవచ్చు.

మారుతున్న జీవనశైలిలో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మన తాతల కాలం నాటి చిరుధాన్యాలకు నేడు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా రాగి జావ మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే రాగులు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉండటం వల్ల, షుగర్ వ్యాధిగ్రస్తులు రాగి జావ తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పరిమిత మోతాదులో తీసుకుంటూ చక్కెర స్థాయిలను గమనించుకోవడం మంచిది. పులియబెట్టిన రాగి జావ అద్భుతమైన ‘ప్రీబయోటిక్‌’గా పనిచేస్తుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. పాఠశాల నుంచి వచ్చే పిల్లలకు రాగి జావలో కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి కలిపి ఇస్తే ఎముకల పుష్టితో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్న బాలికలకు ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి సహకరిస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే రాగి జావను నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. నీటిలో రాగి పిండిని కలిపి మరిగించి, దానికి మజ్జిగ లేదా పాలు జత చేస్తే సరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’

Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!

Follow Us