పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మేర్ NH-48పై గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న భారీ లారీ టైర్ పేలి పల్టీ కొట్టింది. చిడియా బావడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో నడిరోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. నిప్పురవ్వ తగిలితే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి, సిలిండర్లను సురక్షితంగా తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాజస్థాన్లోని జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఒక భారీ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిన సిలిండర్లకు ఏ మాత్రం నిప్పురవ్వ తగిలినా భారీ పేలుడు జరిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ రోడ్డు మధ్యలో పల్టీ కొట్టింది. ఆ సమయంలో లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు రహదారిపై నలువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా సిలిండర్లు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మదన్‌గంజ్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్లు, స్థానికుల సహాయంతో రోడ్డుపై పడ్డ సిలిండర్లను సురక్షితంగా వేరే వాహనంలోకి మార్చారు. సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..
Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్

