Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో
హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికను చాక్లెట్ ఆశ చూపి అపహరించి, అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
హైదరాబాద్ నార్సింగిలో జరిగిన అత్యంత దారుణ ఘటన కలకలం రేపింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, బాలికను గుర్తుతెలియని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలికను కిడ్నాప్ చేయడం, అత్యాచారం చేసి హత్య చేయడం వెనుక గల కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. నార్సింగి పోలీసులు ఈ కేసును రేప్ అండ్ మర్డర్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

