పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..
భోపాల్‌లో పెళ్లి వేదికపై ఊహించని పరిణామం. పెళ్లి మండపంలోనే 'ఇల్లీగల్' గ్యాంగ్ లీడర్ ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 31 క్రిమినల్ కేసులున్న ఆకాష్ కోసం పోలీసులు పక్కా ప్రణాళికతో వచ్చారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీస్ స్టేషన్‌లో పెళ్లికి అనుమతించమని వేడుకున్నా, పోలీసులు తీవ్ర నేరాల దృష్ట్యా ఆమె అభ్యర్థనను తోసిపుచ్చారు.
పెళ్లి వేదికపై వివాహ క్రతువు జరుగుతోంది. బంధువులంతా పెళ్లి హడావిడిలో ఉన్నారు. కొద్ది క్షణాల్లో వరుడు వధువు మెడలో తాళికడతాడు అనగా. ఊహించని విధంగా పెళ్లిమండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు వచ్చింది పెళ్లి చూడ్డానికి కాదు..వరుడ్ని అరెస్ట్ చేయడానికి. సడన్‌లో పెళ్లిమండపంలో పోలీసులను చూసి బంధువులంతా షాకయ్యారు. వారు ఆ షాక్‌నుంచి తేరుకునేలోపే వరుడు అరెస్టయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని వాజ్‌పేయి నగర్ కేంద్రంగా ఆకాష్ ఒక నేర ముఠాను నడుపుతున్నాడు. ఈ ముఠా సభ్యులంతా తమ మెడపై ‘ఇల్లీగల్’ అని టాటూ వేయించుకోవడం గమనార్హం. ఆకాష్, ఇటీవల ఒక పూజారిని కిడ్నాప్ చేసి రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని పెళ్లి మండపంలోనే చుట్టుముట్టారు. వరుడిని పోలీసులు తీసుకెళ్లడంతో, మెహందీ చేతులతో ఉన్న వధువు సీమ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. “సార్.. నా జీవితం నాశనమవుతోంది.. తాళి కట్టే వరకు రెండు గంటలు సమయం ఇవ్వండి” అంటూ పోలీసుల కాళ్లపై పడి వేడుకుంది. అవసరమైతే స్టేషన్‌లోనే పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆకాష్‌పై ఉన్న తీవ్రమైన నేరారోపణల దృష్ట్యా పోలీసులు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చారు. ఆకాష్‌తో పాటు మరో ఐదుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆకాష్ సామాన్యుడు కాదని, అతనిపై 31 క్రిమినల్ కేసులున్నాయని, ఒక పెద్ద ‘ఇల్లీగల్ గ్యాంగ్’కి అతడు లీడర్ అని తెలుసుకున్న వధువు బంధువులంతా అవాక్కయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

