తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
సిద్దిపేట హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో తండ్రి (డ్రైవర్) ఎల్లయ్య, కొడుకు (కండక్టర్) ప్రేమ్ ఒకే బస్సులో విధులు నిర్వర్తించారు. 34 ఏళ్లుగా ప్రమాదరహిత డ్రైవర్‌గా పేరున్న ఎల్లయ్యతో కలిసి తన కొడుకు పనిచేయడం ఆనందాన్నిచ్చింది. ఈ అరుదైన దృశ్యం ప్రయాణికులను, అధికారులను స్ఫూర్తినింపింది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన కొడుకును అధికారులు అభినందించారు.
రక్తసంబంధం ఒకే బస్సులో వృత్తిపరమైన బాధ్యతగా మారింది. తండ్రి బస్సు స్టీరింగ్ పట్టుకోగా, అదే బస్సులో కొడుకు టికెట్లు కొడుతూ ప్రయాణికులకు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిని నింపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని ‘యాక్సిడెంట్ ఫ్రీ’ డ్రైవర్‌గా ఆయనకు పేరుంది. ఎల్లయ్య కుమారుడు ప్రేమ్ కూడా ఇటీవల అదే డిపోలో కండక్టర్‌గా విధుల్లో చేరారు. అయితే, విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం వీరిద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ పడింది. తన కళ్లముందే పెరిగి ప్రయోజకుడైన కొడుకుతో కలిసి విధులు నిర్వహించడం ఎల్లయ్యకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. తన సర్వీసు ముగిసే తరుణంలో కొడుకుతో కలిసి విధులు నిర్వహించడం ఆ ఇద్దరికీ దక్కిన అరుదైన అపురూపమైన క్షణంగా అక్కడి వారు అభివర్ణించారు. ప్రయాణికులు సైతం ఈ తండ్రీకొడుకుల జోడీని చూసి ముచ్చటపడ్డారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, అదే డిపోలో విధుల్లో చేరిన కొడుకును చూసి ఆర్టీసీ అధికారులు సైతం అభినందనలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’
Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..
Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

