ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారత సంతతికి చెందిన మధురాజు చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికన్లు ఎంతో గౌరవించే ఈ ప్రదేశంలో అగౌరవంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో US అధికారులు అతని వీసా రద్దు చేసి, బహిష్కరణకు యోచిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలో ఇటీవల ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి డ్యాన్స్ వైరల్ అయింది. డ్యాన్స్ వైరల్ అయితే గొప్పే కదా అని అనుకోవచ్చు, కానీ అతను డ్యాన్స్ చేసింది వాషింగ్టన్ డీసీలోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. చివరకు ఇప్పుడు అతడి వీసాను రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించాలని యూఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మధురాజు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై యూఎస్‌లో నివసిస్తున్నారు. మహిళతో వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్ చేసిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వార్ మెమోరియల్ రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన 4 లక్షల మందికి స్మారకచిహ్నం. దీనిని అమెరికన్లు ఎంతో గౌరవంగా చూస్తారు. అలాంటి స్థలంలో డ్యాన్స్‌లు ఏంటని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ వైరల్ కావడంతో యూఎస్ అధికారులు దీనిపై దృష్టిసారించారు.మధురాజు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నెటిజన్లు, ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇది వివాదాన్ని మరింత పెంచింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి వీసా స్టేటస్ చెక్ చేస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో విచారణ తర్వాత అమెరికాలో ఉంటాడా.? బహిష్కరణకు గురవుతాడా? అనేది తేలుతుంది. మధురాజు ఈ ఘటనపై క్షమాపణలు చెప్పినప్పటికీ, అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమెరికన్ల త్యాగంతో ముడిపడి ఉన్న స్మారకం వద్ద అగౌరవంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది టిక్‌టాక్‌కు వేదిక కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై చెడు ప్రభావం చూపిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి 2.5 మిలియన్లకు పైగా సైనికులను పంపిందని మరొకరు కామెంట్ చేసారు. ఇలాంటి ప్రదేశాలు టిక్‌టాక్ కు వేదిక కాదని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

