దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి నిశ్చితార్థం రద్దు చేసినందుకు ప్రతీకారంగా మనోహర్ అనే యువకుడు తన హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని యువతికి బలవంతంగా ఎక్కించాడు. ఈ దారుణ చర్యతో యువతికి తీవ్ర జ్వరం వచ్చి, అసలు విషయం బయటపడింది. పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబం న్యాయం కోరుతోంది. ఈ ఘటన సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఓ ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తనను పెళ్లి చేసుకోవడం లేదన్న కక్షతో, ఒక యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు ఓ యువకుడు చేసిన దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో వచ్చిన ‘రాంబాయి’ సినిమా తరహాలో యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు ఆ యువకుడు. అన్నోజిగూడకు చెందిన యువతికి, మనోహర్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, నిశ్చితార్థం తర్వాత మనోహర్‌కు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. తన వ్యాధి గురించి తెలిసి పెళ్లి నిరాకరించిందన్న కోపంతో మనోహర్ ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 11న యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మనోహర్ లోపలికి చొరబడ్డాడు. తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న సిరంజితో, తన శరీరంలోని హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని తీసి యువతికి బలవంతంగా ఎక్కించాడు. ఆ తర్వాత యువతికి విపరీతమైన జ్వరం రావడంతో, అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది. యువతి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ శాడిస్ట్ చర్యకు పాల్పడిన మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక యువతి భవిష్యత్తును అంధకారం చేసిన ఈ నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్
‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

