కరెంట్ తీగలపై మేక విన్యాసాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు
స్టంట్స్ చేయడంలో జంతువులు మనుషులతో పోటీపడుతున్నాయా అనిపిస్తోంది. అవును ఓ మేక ఎవరూ ఊహించని విధంగా అంత ఎత్తున ఉండే కరెంట్ వైర్లపైకి ఎక్కి ఎంచక్కా ఆకులు తింటోంది. ఈ ఘటన చూసి స్థానికులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఇది మేకేనా.. లేక సర్కస్ నుంచి వచ్చిన ఏదైనా వింత జంతువా అని అవాక్కవుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఎలా వెళ్లిందో కానీ ఓ తెల్లని మేక అంత ఎత్తులో ఉన్న కరెంట్ వైర్లపైకి వెళ్లింది. అది ఏమాత్రం భయపడకుండా రెండు విద్యుత్ తీగలపైన తన నాలుగు కాళ్లతో బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఆ వైర్లపై పడిఉన్న ఓ కొమ్మ ఆకులను తింటోంది. అలా కరెంట్ తీగలపై మేకను చూసిన వారు అదెక్కడ జారి పడిపోతుందో, ఎక్కడ కరెంట్ షాక్ కొడుతుందోనని ఆందోళన చెందారు. కానీ ఆ మేక మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా వైర్లపై నిలబడి ఆకులు తినింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గడ్డి కోసం మేక చేసిన స్టంట్ చూసి విద్యుత్ శాఖ అధికారులు కూడా షాక్ అయ్యారు. ఇక నెటిజన్లు రకరకాల రియాక్షన్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అది మేక కాదు.. స్పైడర్‌మ్యాన్‌కి చెల్లెలు అయి ఉంటుందంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్
దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
