దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
ఎవరు చేసే పనిలో వారికి నైపుణ్యం చాలా అవసరం. లేకపోతే ముందుకు వెళ్లలేరు. అది దొంగతనమైనా..మరోటైనా.. ఏదైనా ట్యాలెంట్ ఉండాల్సిందే. ఆ విషయంలో ఓ దొంగను మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే కేవలం సెకన్ల వ్యవధిలో ఎంతో చాకచక్యంగా బైక్ కొట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోలో.. ఓ షాపు ముందు వరుసగా బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. వాటన్నిటినీ దూరం నుంచి పరిశీలించిన ఓ వ్యక్తి నెమ్మదిగా అక్కడకు వచ్చాడు. అక్కడ ఉన్న ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పైన అతని దృష్టి పడింది. అంతే అదేదో తన సొంత బైక్ అన్నట్టుగా బైక్ వద్దకు వచ్చి నిలబడి అటూ ఇటూ చూశాడు. ఎవరూ తనను గమనించడం లేదని ఫిక్స్ అయ్యాక ఓ చిన్న పరికరంతో క్షణాల్లో బైక్ తాళం తెరిచాడు. అనంతరం సీటుపై కూర్చుని బైక్‌ను స్టార్ట్ చేసి రెప్పపాటులో అక్కడి నుంచి మాయమయ్యాడు. బయటకు వచ్చి చూసుకున్న బైక్ యజమాని తన వాహనం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!
వైట్ రైస్‌కి బదులుగా ఓట్స్ తింటున్నారా ?? జరిగేది ఇదే..
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇకపై అలా కుదరదు..
మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

