ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
యాదాద్రి జిల్లా గొల్లగూడెంలో హోలీ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన తల్లి, తన రెండేళ్ల కుమార్తె, పది నెలల కుమారుడిని దిండుతో అదిమి చంపేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాలుతాగే పసిబిడ్డల ప్రాణాలు తీసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
దేశమంతా హోలీ రంగుల సంబరాల్లో మునిగితేలుతుంటే, ఆ గ్రామంలో మాత్రం విషాదం అలముకుంది. నవమాసాలు మోసి కన్నబిడ్డలను, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే.. పసికందుల ప్రాణాలు తీసి, తాను కూడా అనంత లోకాలకు వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గొల్లగూడెంకు చెందిన రైల్వే ఉద్యోగి మేకల మహేశ్ యాదవ్‌కు, ఐశ్వర్యకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె, పది నెలల కుమారుడు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా దంపతుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాయి. మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్లిన ఐశ్వర్యను, పెద్దమనుషులు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు. కానీ, క్షణికావేశం ఆ తల్లి విచక్షణను హరించింది. అందరూ నిద్రపోతున్న సమయంలో, అభం శుభం తెలియని పసిప్రాణాలను దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లారేసరికి విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, పాలు తాగే పసికందులని కూడా చూడకుండా ప్రాణాలు తీయడం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోలీ రోజున జరిగిన ఈ విషాదంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం
మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!

