ఖర్జూరం కల్లుతో ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు..!
మనకు ఈతకల్లు, తాటికల్లు తెలుసు. కొందరు కొబ్బరిచెట్టు నుంచి కూడా కల్లు తీసిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఖర్జూర కల్లు గురించి తెలుసా మీకు? తాటికల్లును మించిన ఆరోగ్య ప్రయోజనాలున్నాయట ఈ ఖర్జూర కల్లుతో.. అవేంటో చూద్దాం. సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్ని సార్లు తియ్యగా, వంగరుగా ఉంటుంది.
కానీ ఖర్జూర కల్లు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఖర్జూర కల్లులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీని వలన జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే ఖర్జూర కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. కల్లులో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఖర్జూర కల్లులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, దీని వలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుందని కల్లు ప్రియుల మాట. సహజసిద్ధమైన ఈ కల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తుందట. ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉండటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇస్తాయి. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదల్లో వింత శబ్ధాలు.. ఏమిటా అని పరిశీలించిన స్థానికులకు షాక్