తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత, 26 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతూ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగీత, ఇప్పుడు నేరుగా కోర్టును ఆశ్రయించారు.