AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారెట్ జ్యూస్‌ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

క్యారెట్ జ్యూస్‌ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

Phani CH

|

Updated on: Apr 12, 2025 | 12:56 PM

క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకి తెలుసు. ఇదొక్కటే కాదు ఎన్నో పోషకాలకు నిలయం క్యారెట్‌. ఏప్రిల్‌ 4 ప్రపంచ క్యారెట్‌ డే సందర్భంగా ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. మన స్కిన్ కేర్ రొటీన్ లో క్యారెట్‌ ది ఎంతో ముఖ్య పాత్ర. క్యారెట్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

అంతేకాదు షుగర్ ఉన్నవారు క్యారెట్ ను డైట్ లో చేర్చుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్‌ పెరగకుండా చూడొచ్చు. మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. క్యారెట్ల‌ను చాలా మంది ప‌చ్చిగా తినేందుకే ఆస‌క్తిని చూపిస్తుంటారు. క్యారెట్ల‌ను కూర‌ల్లోనూ వేస్తుంటారు. అయితే క్యారెట్ల‌ను తిన‌లేని వారు వీటిని జ్యూస్‌లా చేసి కూడా తీసుకోవ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క్యారెట్ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. క్యారెట్ల‌తో జ్యూస్ చేసి రోజూ ఉద‌యాన్నే తాగితే ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లు మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. ఉద‌యం క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల రోజంతా చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. బ‌ద్దకం పోయి యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణక్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. దీంతో క‌డుపు ఉబ్బరం త‌గ్గుతుంది. క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు న‌యం అవుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

ఏ భర్తా ఇవ్వని గిఫ్ట్‌ ఇదీ! కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

ఖర్జూరం కల్లుతో ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు..!

పొదల్లో వింత శబ్ధాలు.. ఏమిటా అని పరిశీలించిన స్థానికులకు షాక్‌

అక్కడ భారీగా బంగారం నిల్వలు.. పసిడి ధరలు పడిపోతాయా?