పిచ్చుక కష్టాలు.. ఓ ఊరునే పరుగులు పెట్టించింది వీడియో
లిఫ్ట్ లో ఉండగానో, ఏదైనా గదిలో ఉండగానో అనుకోకుండా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అక్కడే మనం చిక్కుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇటీవల థాయ్లాండ్ భూకంప ప్రమాదంలో ఒక కుటుంబం తమను కాపాడాలంటూ పెట్టిన వీడియో అందరి హృదయాలను కదిలించింది. ఇంటి పైకప్పు మీద ఒక పెద్ద దిమ్మపడటంతో అక్కడి నుంచి బయటకు రాక ఎంతగానో అల్లాడిపోయారు. బతికిపోయే ఆశతో సాయం చేయండి సాయం చేయండి అంటూ కేకలు వేశారు. మనుషులం కాబట్టి ఇలా నోరు తెరిచి అందరికీ అర్థమయ్యేలా కేకలు పెట్టగలం. కానీ అదే కష్టం ఒక పక్షికి వస్తే దాదాపు ఆరేడు నెలలుగా మూసి ఉన్న ఒక దుకాణంలోకి వెళ్ళిన పిచ్చుక అక్కడే చిక్కుకుపోయింది. బయటకు రాలేక నానా అవస్థలు పడింది. ప్రాణాలు కాపాడుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. గాజు గ్లాసును సైతం పగలగొట్టాలనుకుని దాని బుజ్జి ముక్కుతో టిక్ టిక్ మని కొడుతూ తీవ్రంగా కష్టపడింది కానీ అదంతా వృధా అని తెలుసుకొని కన్నీటి పర్యంతమయింది.
మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా నరకం చూసింది. ఇక తాను అక్కడే చనిపోతాను అని నిశ్చయించుకొని దీనంగా చూస్తూ కూర్చుండిపోయింది. అప్పుడే ఒక వ్యక్తి దాని బాధను అర్థం చేసుకున్నాడు. పిచ్చుక ప్రాణం కూడా మనిషి ప్రాణం లాగే అని భావించి దాన్ని కాపాడేందుకు చాలానే ప్రయత్నించాడు. కానీ ఆ దుకాణం తెరిస్తే తప్ప పిచ్చుకను బయటకు తీసుకు రాలేమని అతడికి అర్థమయింది. ఎందుకంటే ఆ దుకాణాన్ని కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేశారు. దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికీ లేదు. కానీ ఎలాగైనా ఆ బుజ్జి పిట్టను కాపాడాలనుకున్న అతడు ఊరందరినీ ఏకం చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన ఈ కథ కేరళలో జరిగింది. కేరళ కన్నూరులోని ఉల్లికల్ గ్రామంలో ఒక బట్టల దుకాణం ఉంది. అయితే ఆరు నెలల క్రితం ఆ దుకాణ భాగస్వాములు గొడవపడి కోర్టుకు వెళ్ళారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆ దుకాణాన్ని సీల్ చేసింది. ఎవరూ అందులోకి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ఆ దుకాణం మూసే ఉంచగా ఏప్రిల్ ఏడవ తేదీన అనుకోకుండా ఒక పిచ్చుక అందులోకి ప్రవేశించింది. ముఖ్యంగా షట్టర్ ముందు వైపు గాజు గ్లాస్ ఉండగా ఆ రెండిటి మధ్య ఇరుక్కుపోయింది. ఇలా ఆ దుకాణంలో చిక్కుకుపోయిన పిచ్చుకకు బయటకు ఎలా రావాలో తెలియక నానా ఇబ్బందులు పడింది. ముఖ్యంగా తీవ్రంగా చప్పుడు చేస్తూ తన బుజ్జి ముక్కుతో ఆ గాజు గ్లాసును పగలగొట్టేందుకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న పాదాచారులు ఆటో డ్రైవర్లు ఈ విషయాన్ని గుర్తించారు.
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

