ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
అనేక వ్యాధుల వ్యాప్తి మన చేతుల ద్వారానే జరుగుతుంది. 2017లో ప్రచురించబడిన Journal of Infectious Diseases అధ్యయనంలో కూడా చేతుల పరిశుభ్రత వల్ల పేగు సంబంధ వ్యాధులు తగ్గుతాయని తేలింది. అందువల్ల కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తాకిన వెంటనే చేతులు కడుక్కోవడం అనివార్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కరెన్సీ నోట్లు అనేక మంది చేతుల్లో మారిపోతూ ఉండటంతో సూక్ష్మక్రిములు, వైరస్లు కలిగి ఉంటాయి. నోట్లను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చాలా అవసరం. హోటల్, రెస్టారెంట్లలో ఉండే మెనూ కార్డులు అనేక మంది చేతుల్లో మారిపోతాయి. ఒక రెస్టారెంట్ మెనూ కార్డుపై సుమారు 1,85,000 రకాల బ్యాక్టీరియా ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ మెనూలను తాకిన తర్వాత చేతులు కడుక్కోకపోతే ఆహారం తినేటప్పుడు క్రిములు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే రెస్టారెంట్ మెనూలను తాకిన వెంటనే లేదా ఆహారం తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆసుపత్రుల లోపల అనేక వైరస్లు, సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ బెంచీలు, డోర్ హ్యాండిల్స్, ఎక్స్-రే మెషిన్లు, బైఓమెట్రిక్ ప్యాడ్స్ వంటి వస్తువులను తాకిన వెంటనే చేతులను శుభ్రం చేసుకోవడం ఆరోగ్య రక్షణకు చాలా అవసరం. ప్రజా రవాణా వాహనాలు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను తీసుకెళ్తాయి. ప్రయాణికుల చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి బస్సు హ్యాండిల్స్, మెట్రో గేట్లు తాకిన వెంటనే చేతులను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్ చేసిన పనికి.. అందరు షాక్