Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..

పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: May 19, 2025 | 8:50 AM

మామిడిపండ్లంటే ఇష్టపడనివారుండరు. వేసవి వస్తుందంటే తియ్యతియ్యని మామిడిపండ్లే గుర్తుకొస్తాయి. చెట్టుకి పూత వచ్చినప్పటినుంచి మామిడిచెట్లపైనే ఉంటుంది దృష్టి. వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్లిన విద్యార్ధులు మామిడితోటల్లో ఆడుకుంటూ పచ్చి మామిడికాయలు కోసుకుని ఉప్పు, కారం వేసుకుని తింటూ ఎంజాయ్‌ చేస్తారు. వివరాలు

పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వ్యాధుల నుండి రక్షణ ఇచ్చే శక్తిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ అంటువ్యాధుల వంటి సమస్యలను అడ్డుకునే శక్తిని ఇస్తుంది. వేసవి వేడి తీవ్రంగా ఉండే సమయాల్లో శరీరం వేడి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు నీటి స్థాయిని సమతుల్యంలో ఉంచుతాయి. అధికంగా వాపు, తలనొప్పి లాంటి వేడి కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది. పచ్చి మామిడిలో ఫైబర్, పెక్టిన్ లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగవ్వడానికి సహాయపడతాయి. ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మామిడికాయను ఉప్పు, కారం కలిపి తినడం మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పచ్చి మామిడిలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హృదయానికి సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా ??

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??

వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..

ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్