వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు తరచు పండ్లు తినమని సూచిస్తారు. సాధారణంగా వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీరు అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఈ సమయంలో బొప్పాయి పండ్లు తినడం వల్ల కోల్పోయిన నీటిని తిరిగి శరీరానికి అందిస్తుంది. బొప్పాయిలో 88 శాతం నీరు ఉంటుంది. బొప్పాయితో పాటు నారింజ, పుచ్చకాయ, ఖర్బూజ, దోసకాయ వంటివి తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే విటమిన్ A, C, E చర్మానికి తేమ, మెరుపును తెస్తాయి.
వేసవిలో చర్మం కాంతి విహీనంగా మారుతుంది. బొప్పాయి చర్మానికి టానిక్ లా పనిచేస్తుంది. బొప్పాయిలో పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు తరచు తలెత్తుతాయి. ఇలాంటి వారు బొప్పాయి తింటే ఉపశమనం కలుగుతుంది. రోజు ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తింటే అజీర్తి రాదు. అలాగే తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న బొప్పాయి కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేసవిలో ఎండ వల్ల కళ్ళు పొడిగా మారవచ్చు. బొప్పాయిలోని విటమిన్ A కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ క్రమంలో బొప్పాయి మంచి ఎంపిక అంటున్నారు పోషకాహార నిపుణులు. బొప్పాయిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. వేసవిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
