పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్ట్ స్ట్రోక్
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఒక పెళ్లి వేడుకలో విషాదం నలుగుంది. పెళ్లి వూరేగింపులో స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో సుంకరి బంగారు నాయుడు అనే 38 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు బంగారు నాయుడు పెయింటింగ్ మేస్త్రీగా జీవనం కొనసాగిస్తూ విద్యా కమిటీ ఛైర్మన్ గా గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు.
ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పక్కింట్లో బంధువుల కుర్రాడి పెళ్లికి అంతా తానే నిలిచాడు బంగారు నాయుడు. గురువారం తెల్లవారుజామున దగ్గరుండి డిజే సౌండ్ల మధ్య వూరేగింపును నిర్వహించాడు. వూరేగింపు చివరికి వచ్చిన సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి తాను స్టెప్పులు వేశాడు. అలా స్టెప్పులు వేస్తుండగానే గ్రామస్తుల కళ్లముందు కుప్పకూలిపోయాడు. మొదట తూలి పడిపోయాడని అతనితో కలిసి డాన్స్ చేసిన స్నేహితులు భావించారు. కిందపడిన వ్యక్తిని పైకి లేపే క్రమంలో బంగారు నాయుడు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలికిపడ్డారు. డిజేల చప్పుడు సరిపడని నిద్రలేక అప్పటికే బాగా అలసటగా ఉన్న బంగారు నాయుడు ఒక్కసారిగా హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందాడు.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

