గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
జనగామ జిల్లా గూడూరు ఎస్టీ బాలికల గురుకుల విద్యార్థినులు క్షుద్రపూజలు, వసతుల కొరతపై ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ పసుపు నీళ్లు చల్లించి భయపెట్టారని, సరైన భోజనం, ఉపాధ్యాయులు లేరని వాపోయారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్‌తో విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
సమస్యలు పరిష్కరించమంటే.. క్షుద్రపూజలు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా మంగళవారం పాలకుర్తి – ఘన్‌పూర్ ప్రధాన రహదారిపై విద్యార్థినులు బైఠాయించి ధర్నా చేపట్టారు. హాస్టల్‌లో కనీస వసతులు లేవని, సరైన భోజనం అందడం లేదని, ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని విద్యార్థినులు వాపోయారు. అయితే, ఈ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రిన్సిపల్ రేణుక రాథోడ్ రెండు రోజుల క్రితం పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహించారని వారు సంచలన ఆరోపణలు చేశారు. క్లాస్ రూమ్‌లు, ప్రహరీ చుట్టూ పసుపు నీళ్లు చల్లించారని, అప్పటినుంచి విద్యార్థులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధర్నా స్థలానికి చేరుకుని విద్యార్థినుల సమస్యలపై ఆరా తీసారు. తక్షణమే జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో ఫోన్‌లో మాట్లాడి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థినులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రతినెలా పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
Vijay-Rashmika Marriage: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
గర్ల్ ఫ్రెండే.. దగ్గరుండి డ్రగ్స్ డాన్‌ను పట్టించింది
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్ 9 విశేషాలు..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

