Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్ 9 విశేషాలు..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మూడంచెల భద్రత, అంబానీ కుటుంబం హాజరవుతున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కొడవ సంప్రదాయ దుస్తులు, జపనీస్ వంటకాలతో కూడిన ప్రత్యేక మెనూ, కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పెళ్లి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
01.వేదిక దగ్గర మూడంచెల భద్రత చీమ చిటుక్కుమన్నా.. దొరికిపోతారు!
విజయ్ దేవరకొండ – రష్మిక వివాహం అతి కొద్ది వీవీఐపీ అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి జరిగే ఐటీసీ మెమెంటో హోటల్ దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చూసే ఏజెన్సీలకు చెందిన కొంత మంది కూడా ఈ వేడుక జరిగే వేదిక చుట్టూ భద్రత కల్పించనున్నారని సమాచారం.
02. విజయ్- రష్మిక పెళ్లికి విచ్చేసిన.. అంబానీ కుటుంబం
ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు.. మీడియాలోనూ.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనూ.. అందరూ విరోష్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లి గురించే ఆరా తీస్తున్నారు. ఇక ఈక్రమంలోనే విరోష్ పెళ్లికి అంబానీ కుటుంబం కూడా హాజరవుతుండడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ఇప్పటికే అంబానీ విజయ్ పెళ్లి వేదిక దగ్గర కనిపించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
03.రష్మిక- విజయ్‌కు మోదీ సూచనలు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నెక్స్ట్ ఫేజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వివాహ బంధంతో ఒక్కటై.. జీవితాన్ని కలిసి కొనసాగించబోతున్నారు. ఈ క్రమంలోనే వీరికి శుభాకాంక్షలు చెబుతూ.. పీఎమ్ మోదీ .. ఈ స్టార్ కపుల్‌కు ఓ లేఖను పంపారు. సప్తపదితో జీవితాంతం స్నేహంతో వర్ధిల్లాలని ఆశీస్సులు అందజేశారు. అలాగే విజయ్ – రష్మిక జీవితం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. పరస్పరం గౌరవం, ప్రేమ, బాధ్యతలను పంచుకోవాలని మోదీ ఈ స్టార్ జోడీకి సూచించారు.
04. పెళ్లికి ముందే పూల్లో ఆటలు.. అబ్బో మామూలుగా లేదుగా..
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చాలా ప్రైవేట్‌గా.. చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. తమ పెళ్లి వేడుకను కలకాలం గుర్తుండి పోయేలా.. ఫన్ ఫుల్ గేమ్స్‌తో.. వెరైటీ ఫుడ్‌తో.. చాలా యాక్టివిటీ సెగ్మెంట్స్‌తో డిజైన్ చేసుకున్నారు విజయ్ అండ్ రష్మిక. ఇక ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు రెండు జట్లుగా విడిపోయి పూల్ వాలీబాల్ ఆడినట్టుగా తెలుస్తోంది.
05. విజయ్ తల్లి వారసత్వ కానుకతో.. ఆనందంలో రష్మిక
తను మెచ్చిన అమ్మాయే తనకు కోడలిగా.. తన ఇంటికి వస్తుందన్న ఆనందలో ఉన్న విజయ్ తల్లి మాధవి.. తనకు కాబోయే కోడలికి వారసత్వంగా కానుక అందించారట. తమ దేవరకొండ వంశలో… కోడలికి వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను విజయ్ తల్లి మాధవి.. రష్మికకు ప్రజెంట్ చేశారట. ఇక వేడుక కూడా గ్రాండ్‌గా అండ్ ఎమోషనల్‌గా సాగినట్టు ఇన్‌సైడ్ టాక్.
06. నాటుకోడి – చిట్టి గారె.. ఖీమా సమోసా-ధమ్ బిర్యానీ.. అబ్బో.. నోరూరించే వంటకాలు..!
తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే డెలీషియస్ డిషెస్‌ను చేపించారట విజయ్ అండ్ రష్మిక. తమ పెళ్లికి వచ్చే అతిథులందరికీ కొబ్బరి నీళ్లను అందిస్తున్నారట. ప్రతీ ఒక్కరికి అరిటాకులో భోజనం వడ్డించేలా ప్లాన్ చేశారు. ఇక వంటకాల విషయానికి వస్తే.. ఎంపిక చేసిన ఆంధ్ర, తెలంగాణ వంటకాలను తమ పెళ్లి మెనూలో ఉండేలా ప్లాన్ చేశారట. విజయ్-రష్మిక. నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, పప్పు, పాతబస్తీకి చెందిన ఖీమా సమోసా వంటివి మెనూలో ఉన్నాయని తెలుస్తోంది. వీటితో పాటే రష్మిక తరపున కూర్గ్ ప్రత్యేక వంటకాలైన కదంబుట్టు అంటే రైస్ బాల్స్, పాండి కర్రీ, నూల్‌పుట్టు అంటే రైస్ నూడిల్స్ వంటి వాటిని కూడా సిద్ధం చేస్తున్నారట. స్వీట్స్‌లో… ఫేమస్ మైసూర్ పాక్ ప్రత్యేకంగా వడ్డించనున్నారు. వీటితో పాటు రష్మికకు ఇష్టమైన జపనీస్ డిషెస్‌ను కూడా అతిథుల కోసం ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారట విజయ్ అండ్ రష్మిక.
07. రష్మికకు ఇష్టం అని ప్రీ వెడ్డింగ్‌లో విజయ్ ఏం చేపించారంటే..
చూస్తే సన్నగా కనిపిస్తున్నా రష్మిక మంచి ఫుడీ. అందులోనూ జపనీస్ రుచులంటే ఈ నేషనల్ క్రష్‌కు చాలా ఇష్టం. అందుకే తమ వెడ్డింగ్ ఈవెంట్‌కి వచ్చే అతిథులకు జపనీస్ వంటకాలను వండి వడ్డించాలని విజయ్ ఫిక్స్ అయ్యారట. ఈక్రమంలోనే రష్మికకు ఇష్టమైన జపనీస్ డిషెస్ ను అతిథుల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట. రష్మికకు ఇష్టమైన వంటకాలను అందరికీ పరిచయం చేశాడట విజయ్.
08. జస్ట్ పెళ్లి వేదిక కోసమే రూ.4 కోట్లు ఖర్చు
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ITC మెమెంటోస్ ఎకాయా రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ రిసార్ట్‌లో సాధారణంగా రెండు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం దాదాపు 2.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారట. ఇందులో వసతి, భోజనం, వేదిక అద్దె అన్నీ కలిపై ఈ అమౌంట్ ను ఛార్జ్ చేస్తారట. రష్మిక విజయ్ పెళ్లి వేడుక మూడు రోజులు జరగనుంది. దాంతో పాటు అతిథుల కాస్త ముందుగా వచ్చినా.. లేట్‌గా వెకేట్ చేసినా కూడా.. నాలుగు నుంచి ఐదు రోజులు ఈ రిసార్ట్ బుక్ చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన ఈ రిసార్ట్ అద్దె కోసమే విజయ్ దాదాపు 4 కోట్లు చెల్లిస్తున్నట్టుగా టాక్.
09.కొడవ వివాహ పద్దతిలో వరుడు, వధువు ఎలాంటి బట్టలు ధరిస్తారంటే…
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఇటు తెలుగు సంప్రదాయ పద్దతితో పాటు కొడవ వివాహ సంప్రదాయ పద్దతిలో కూడా జరగనుందని తెలుస్తోంది. కొడవ పద్దతిలో వధూవరుల దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొడవ తెగ వీరత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ వివాహ వేడుకలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కూడా ఇవే సాంప్రదాయ దుస్తులను ధరించనున్నారు. వధువు రష్మిక మందన్న దుస్తుల విషయానికి వస్తే.. కూర్గి శైలి చీర ధరించాలి. వధువు సాధారణంగా ఎరుపు రంగు పట్టు చీరను ధరిస్తుంది. ఈ చీర కట్టు చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా చీర కుచ్చుళ్లు ముందు ఉంటాయి.. కానీ వీరి సంప్రదాయంలో చీర కుచ్చెళ్లు వెనుక భాగంలో వస్తాయి అంతేకాదు చీర అంచు వెనుక నుంచి వచ్చి కుడి భుజంపై ఒక పిన్‌తో ఉంటుంది. కుప్పస – ఇది చీర లోపల ధరించే పొడవాటి చేతుల బ్లౌజ్. వస్త్ర – తల మీద ఎరుపు రంగులో ఉండే తలపాగా లేదా స్కార్ఫ్ లాంటిది. ఇక వధువు తన చేతులకు, కాళ్లకు వెండి గొలుసులను ధరిస్తారు. మెడలో చంద్రుని ఆకారంలో ఉండే పతకం.. దీన్ని వాళ్లు ‘కొక్కెతతి’ అంటారు. వీటిని అభరణాలుగా ధరించాల్సి ఉంటుంది. వరుడు విజయ్ దేవరకొండ దుస్తుల విషయానికి వస్తే.. కుప్యా అంటే వరుడు మోకాళ్ల వరకు ఉండే తెలుపు రంగు పొడవాటి కోటును ధరిస్తారు. సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది, కానీ పెళ్లికి తెలుపు రంగు మాత్రమే ధరిస్తారు. రెండోది చేలే – నడుము చుట్టూ ఎరుపు, బంగారు రంగు సిల్క్ క్లాత్ ను కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నడుము బెల్ట్ లాంటిది. పీచే కత్తి – నడుము పట్టీలో వెండితో చేసిన చిన్న కత్తి ధరిస్తారు. ఇది కొడవ పురుషుల వీరత్వానికి చిహ్నం. మండే తుని – తలపై ధరించే తెల్లని తలపాగా. గెజ్జె తండే – కుడి చేతిలో గంటలు ఉన్న కర్రను పట్టుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే
Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

