AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే

Phani CH
|

Updated on: Feb 26, 2026 | 3:15 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తెలుగు సంప్రదాయ పద్ధతితో పాటు కొడవ ఆచారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కొడవ పద్ధతిలో వరుడు ప్రత్యేక దుస్తులైన కుప్యా, చేలే, పీచే కత్తి, మండే తుని, గెజ్జె తండే ధరించనున్నారు. ఈ దుస్తులు కొడవ తెగ వీరత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక సైతం ఈ సంప్రదాయ వస్త్రాలనే ధరిస్తారు.

విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఇటు తెలుగు సంప్రదాయ పద్దతితో పాటు కొడవ వివాహ సంప్రదాయ పద్దతిలో కూడా జరగనుందని తెలుస్తోంది. కొడవ పద్దతిలో వధూవరుల దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొడవ తెగ వీరత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ వివాహ వేడుకలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కూడా ఇవే సాంప్రదాయ దుస్తులను ధరించనున్నారు. వరుడు విజయ్ దేవరకొండ దుస్తుల విషయానికి వస్తే.. కుప్యా అంటే వరుడు మోకాళ్ల వరకు ఉండే తెలుపు రంగు పొడవాటి కోటును ధరిస్తారు. సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది, కానీ పెళ్లికి తెలుపు రంగు మాత్రమే ధరిస్తారు. రెండోది చేలే – నడుము చుట్టూ ఎరుపు, బంగారు రంగు సిల్క్ క్లాత్ ను కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నడుము బెల్ట్ లాంటిది. పీచే కత్తి – నడుము పట్టీలో వెండితో చేసిన చిన్న కత్తి ధరిస్తారు. ఇది కొడవ పురుషుల వీరత్వానికి చిహ్నం. మండే తుని – తలపై ధరించే తెల్లని తలపాగా. గెజ్జె తండే – కుడి చేతిలో గంటలు ఉన్న కర్రను పట్టుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు

Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్‌ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే

Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్‌

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..

Follow Us