Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
ఈరోజు బంగారం ధరలు కాస్త శాంతించాయి. అంతర్జాతీయ ఆందోళనలు, డాలర్ బలహీనతతో పెట్టుబడిదారులు పసిడి వైపు మళ్లడంతో ఇటీవల ధరలు భారీగా పెరిగాయి. నేడు 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.210, 22 క్యారట్ల ధర రూ.200 తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తాజా ధరలను తనిఖీ చేయండి.
బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి, వెండి ధరలను అమాంత పెంచేస్తున్నాయి. డాలర్ బలహీనపడటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పీక్ స్టేజీకి వెళ్లిన బంగారం ధరలు ఇంకా తగ్గాలని పసిడి ప్రియులు కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 26, గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల Gold ధర రూ.210 తగ్గి రూ.1,61,680 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం రూ.2,95,000లతో స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24, గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,830 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,350 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,680 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,200 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,770 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,49,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,680 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,200 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika Marriage: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
గర్ల్ ఫ్రెండే.. దగ్గరుండి డ్రగ్స్ డాన్‌ను పట్టించింది
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్ 9 విశేషాలు..
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

