AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా పునర్జన్మ

Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా పునర్జన్మ

Phani CH
|

Updated on: Feb 26, 2026 | 8:10 PM

Share

అరుదైన SMA వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు తెలుగు ప్రజలు, కంటెంట్ క్రియేటర్లు ఏకమయ్యారు. సోషల్ మీడియా ద్వారా జరిగిన క్రౌడ్ ఫండింగ్ అద్భుత విజయం సాధించి, రూ.8.53 కోట్లకు పైగా నిధులు సేకరించింది. తండ్రి సురేశ్ కుమార్ విరాళాలు ఆపాలని కోరారు. మిగులు నిధులను ఇతర చిన్నారుల కోసం వినియోగిస్తామని ప్రకటించడం తెలుగువారి మానవత్వానికి ప్రతీక.

అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. పునర్వికను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని పాప తండ్రి సురేశ్‌ కుమార్ వీడియో ద్వారా కోరారు. తన కుమార్తెకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెప్పారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేశ్‌ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. చికిత్సకు వాడే ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు అని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ ద్వారా చిన్నారి పరిస్థితిని వివరిస్తూ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ పిలుపునకు యువత, ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ‘ట్రావెల్ విత్ జగదీష్’ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే రూ.కోటిన్నరకు పైగా సేకరించడం విశేషం. ఇలా ప్రజల నుంచి మొత్తం రూ.8.53 కోట్లకు పైగా విరాళాలు అందగా, ప్రభుత్వ సాయంతో కలిపి చికిత్సకు కావాల్సిన నిధులు సమకూరాయి. ప్రస్తుతం పాప ఆసుప‌త్రిలో ఉందని, నాలుగైదు రోజుల్లో ఆమె ఆరోగ్యంపై పూర్తి అప్‌డేట్ ఇస్తానని సురేశ్‌ కుమార్ తెలిపారు. చికిత్సకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులు అందాయని, మిగిలిన డబ్బును తనలాగే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారుల వైద్యానికి అందిస్తానని ఆయన ప్రకటించడం అందరినీ కదిలించింది. వాస్తవానికి ఇంజెక్షన్ ఖర్చు కూడా అంచనా వేసిన దానికంటే తక్కువగా, సుమారు రూ.10 కోట్ల లోపే ఉండవచ్చని అన్నారు. చిన్నారి ప్రాణం కోసం తెలుగు ప్రజలు చూపిన చొరవ, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

Vijay-Rashmika Marriage: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

గర్ల్‌ ఫ్రెండే.. దగ్గరుండి డ్రగ్స్‌ డాన్‌ను పట్టించింది

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

Follow Us