తెలంగాణలో ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఓ జిల్లా కలెక్టర్ బదిలీని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్, భూ సమస్యలు, ఔట్ సోర్సింగ్ పోస్టులు, పారిశుద్ధ్యం వంటి కీలక సమస్యలను పట్టించుకోకపోవడం, గిరిజన జిల్లా అభివృద్ధిని వెనక్కి నెట్టడం పట్ల అసంతృప్తి నెలకొంది.