ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
హైదరాబాద్‌లోని ఓ హిందూ కుటుంబం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ కోసం పండ్లను పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, భాగ్యనగరపు 'గంగా-జమునా తెహజీబ్' సంస్కృతిని కళ్ళకు కట్టింది. కులమతాలకతీతంగా మానవత్వం గొప్పదని చాటిచెప్పిన ఈ కుటుంబం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని మరోసారి చాటుతోంది ఈ ఘటన. కులమతాల కతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుతూ హైదరాబాద్‌కు చెందిన ఒక హిందూ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నగరంలోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన దయానంద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మత సామరస్యాన్ని చాటారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరుల కోసం ఆయన పెద్ద మొత్తంలో పండ్లను సేకరించి మసీదుకు వెళ్లారు. సూర్యాస్తమయ సమయంలో ఇఫ్తార్ విందు కోసం ఎదురుచూస్తున్న ముస్లింలకు ఆ పండ్లను స్వయంగా పంపిణీ చేశారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దయానంద్ కుటుంబ సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో, వారి ఆచారాలను గౌరవిస్తూ అక్కడ గడపడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ కుటుంబంలోని మహిళలు సైతం మసీదు మర్యాదలను గౌరవిస్తూ తలపై ముసుగు వేసుకుని రావడం వారి సంస్కారానికి అద్దం పట్టింది. భాగ్యనగరపు ‘గంగా-జమున తహజీబ్’ సంస్కృతిని ఈ ఘటన కళ్లకు కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టిట వైరల్ కావడంతో నెటిజన్లు “నిజమైన భారతీయులు అంటే వీరే” అంటూ కొనియాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా దయానంద్ కుటుంబం చూపించిన ప్రేమకు సామాజిక మాధ్యమాల వేదికగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మత విద్వేషాల కంటే మానవత్వం గొప్పదని చాటిన ఈ కుటుంబం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే
Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు
Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??

