Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంధులను కలిపిన ప్రేమ.. అనాథను పెళ్లాడిన లక్ష జీతగాడు

అంధులను కలిపిన ప్రేమ.. అనాథను పెళ్లాడిన లక్ష జీతగాడు

Phani CH

|

Updated on: May 20, 2025 | 2:57 PM

డబ్బు, పలుకుబడి, హోదా ఇవన్నీ అక్కడ పక్కకెళ్లిపోయాయి. కేవలం మానవత్వం, మంచితనం, మంచి మనసు మాత్రమే అక్కడ పరిమళించాయి. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నెలకు లక్ష రూపాయిల జీతం, కుటుంబం ఉన్నా సరే.. ఓ అనాథను పెళ్లి చేసుకున్నాడా యువకుడు. ఇద్దరూ అంధులే. అయినా లోకాన్ని చూడలేకపోతే ఏముంది.. ఒకరి మనసుకు మరొకరు నచ్చారు.

అది చాలు. అందుకే ఆదర్శ వివాహం చేసుకున్నారు. మీరూ నిండు మనసుతో వారిని ఆశీర్వదించండి. మ్యారేజ్ ఈజ్ మేడ్ ఫర్ హెవెన్ అంటారు. ఎస్.. నిజమే.. విశాఖలో ఓ జంట వివాహం చూస్తే ఆ పదం వాళ్లకే అంకితం అన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. అంతటి విశేషం ప్రాధాన్యత ఉంది ఆ జంటలో..! కుటుంబాలు , నేపథ్యం వేరు వేరు… కానీ ఇద్దరు మనసు ఒకటే.. ఒకేలా ఆలోచించారు. వెనుదిరిగి చూడలేదు. తనకు తనలాంటి వారే జీవితంలో తోడుగా ఉండాలని అనుకొని .. ఆ కలను సాకారం చేసుకొని ఏకమయ్యారు. ఇద్దరికీ విధి చిన్నచూపు చూపినా.. ఆ ఇద్దరూ ఏకమై జీవితాన్ని చూడాలనుకున్నారు. కళ్ళు లేకపోయినా.. స్వచ్ఛ మనసుల్లోనే రూపురేఖలను చూసుకున్నారు. మనసుంటే చాలు రూపురేఖలు ఎందుకని అనుకున్నారు. విధి చిన్న చూపు చూసి కళ్ళల్లో చీకటి నింపినా.. ఇద్దరూ ఏకమై జీవితంలో వెలుగులు నింపుకున్నారు. విశాఖకు చెందిన శివ జ్యోతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. పుట్టుకతోనే ఆంధత్వం. తల్లితండ్రులను కోల్పోయి అనాథగా ఉన్న ఆమెను ప్రేమ సమాజం అక్కున చేర్చుకుంది. దీంతో ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమ సమాజంలోనే పెరిగింది. ఇక అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన రాఘవేంద్ర పుట్టుకతోనే అంధుడు. తల్లి తండ్రి, తోబుట్టువు ఉన్నారు. రాఘవేంద్ర కోయంబత్తూర్ లో ఈపీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రకు నెలకు లక్ష రూపాయలు జీతం. తనలాగే కంటి చూపులేని తన నెచ్చెలినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హనుమాన్‌ ఆలయంలో ముస్లింలే పూజారులు

ఆ ఇంటిలో అర్ధరాత్రి అరుపులు… చాటుగా చూసినవాళ్లు షాక్‌

బ్యాంకింగ్‌లో కొత్త టెక్నాలజీ ఫేస్‌ పే గురించి తెలుసా

తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో.. గుండెల్ని పిండేసే స్టోరీ

క్రేజీ అప్‌డేట్‌! బుర్జ్ ఖలీఫాపై.. పవన్‌ కల్యాణ్‌ “హరిహర” ట్రైలర్ రిలీజ్‌