51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో
అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడం కోసం వేల కిలోమీటర్ల ప్రయాణిస్తాయి. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా గహీర్మట్ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి 51 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది ఒక తాబేలు. ఇది 1000 కిలోమీటర్లు ఈదినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రేమ్ శంకర్ జ్ఞా తెలిపారు. ఆలివ్ రిడ్లీకి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ట్యాగ్ అమర్చి పరిశీలించగా ఈ విషయాలు తెలిసిందన్నారు.
ఈ తాబేళ్లు శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఆంధ్రకు చేరిందని చెప్పారు. నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ చేసిన మరో తాబేలు 3500 కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాకినాడ బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాబేళ్ల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ని పవన్ ఆదేశించారు. అయితే భాపట్ల జిల్లా సూర్యలంకలో సైతం ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతివాత పడ్డాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే సమయంలో వలలు, వేటపడవలు తగలడం, కాలుష్యం కారణంగా చనిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే వీటి జీవన విధానం, పునరుత్పత్తిపై పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం :
బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో
వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో
‘జిలేబీ బేబీ’ పాట పాడిన మిస్ యూఎస్‌ఏ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
