Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

Samatha J

|

Updated on: May 19, 2025 | 5:00 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల జీవన విధానాన్ని మార్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఊహించని దానికంటే అన్ని రంగాలకు సెరవేగంగా విస్తరిస్తుంది ఏఐ. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఐటీ, అగ్రికల్చర్ ఇలా ఏ రంగంలో చూసినా అన్నింటిలో ఏఐ దూసుకుపోతుంది. వైద్యరంగంలో ఇప్పటికే టెక్నాలజీ పాతుకుపోయింది. ఇక ఏఐ రాకతో మెడికల్ ఫీల్డ్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే హాస్పిటల్ ను చైనాలో రూపొందించారు. ఏజెంట్ హాస్పిటల్ అనే పేరుతో ఈ వర్చువల్ హాస్పిటల్ ని చైనాలోని ప్రముఖ సింగహావా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఏఐ హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది మొత్తం వర్చువల్ గానే ఉంటారు. 42 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు ఈ ఏఐ హాస్పిటల్ లోని సేవలు అందిస్తారు. చాట్ జిపిటి 3.5 టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఐ రోబోలు ఈ ఏఐ హాస్పిటల్ లోని డాక్టర్ల పనిని నిర్వర్తిస్తున్నాయి. ఈ ఏఐ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీతో సహా మొత్తంగా 21 విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ లో వేగంగా ఖచ్చితత్వం ఈ ఏఐ డాక్టర్ల స్పెషాలిటీ. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఈ ఏఐ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ మానవ డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 82% నుంచి 85% వరకు ఉంటుంది. కానీ ఇక్కడి ఏఐ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 93% వరకు ఉంటుందని సింకోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అదేవిధంగా కొన్ని రోజుల్లోనే దాదాపు 10,000 మంది రోగులకు ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం ఏఐ డాక్టర్లకు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో

Published on: May 19, 2025 04:59 PM