ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
అప్పటిదాకా ఏసీలో చల్లగా కునుకు తీస్తున్న శరీరాలకు ఒక్కసారిగా వేడి తగిలింది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించనంత దట్టమైన పొగ. ప్రమాదం జరిగిందని అర్థమైంది. కానీ బయటపడే దారి లేదు. అంతటి భయాణక పరిస్థితుల్లోనూ పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరి క్షణం దాకా ప్రయత్నించింది. విధి ఆడిన వింత నాటకంలో చివరికి నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. 17 మంది మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే. పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు.
ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో. గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటిపడింది విషాద దృశ్యం. పొగ మంటలతో నిండిన ఆ ఇంటి మొదటి అంతస్తులో కనిపించింది మహిళా మృతదేహం. కానీ తను ఒంటరిగా లేదు. ఆమె చేతుల్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఓ పసికందు. మొబైల్ టార్చ్ వెలుగులో బయటపడేందుకు మార్గం ఏదైనా దొరుకుతుందని ఆ మహిళ చివరి దాకా ప్రయత్నించింది. ఓవైపు మంటలు మరోవైపు పొగతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
