Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో నటిగా స్టార్ డమ్ సంపాదించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..
Barkha Madan
Rajitha Chanti
|

Updated on: May 17, 2025 | 9:25 AM

Share

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్స్ చాలా ఆకర్షణీయమైన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ తెరవెనుక వారి వ్యక్తిగతం జీవితాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని తమ నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందిన వారే. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినీరంగుల జీవితాన్ని విడిచిపెట్టింది. ఒకప్పుడు ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకే గట్టిపోటీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలు వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. అప్పట్లో ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్‏గా వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారి.. పర్వతాలలో నివసిస్తుంది. ఆమె మరెవరో కాదు.. బర్ఖా మదన్.

1996లో ‘ఖిలాడియోన్ కా ఖిలాడీ’ అనే యాక్షన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో అక్షయ్ కుమార్, రేఖ , రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కీలకపాత్రలో నటించిన బర్ఖా మదన్.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మరో అవకాశం అందుకోవడానికి ఆమెకు ఏడు సంవత్సరాలు పట్టింది. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ర్ చిత్రం భూత్ లో మంజిత్ ఖోస్లా అనే భయానక పాత్రను పోషించింది. ఈ పాత్రతో ప్రేక్షకులపై మంచి ముద్ర వేసింది. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్, తనూజ వంటి ప్రముఖ నటులతో కలిసి బర్ఖా నటించింది.

భూత్ సినిమా తర్వాత తిరిగి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2005 నుంచి 2009 వరకు జీటీవీలో వచ్చిన సాత్ ఫేరే సలోని కా సఫర్ అనే సీరియల్లో నటించింది. 2010 లో బర్ఖా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుని గోల్డెన్ గేట్ LLC ని స్థాపించారు. తన సొంత బ్యానర్ పై సోచ్, సుర్ఖాబ్ అనే రెండు సినిమాలను నిర్మించింది. ఆ తర్వాత 2012లో ఆమె బౌద్ధమతంలోకి మారాలని నిర్ణయించుకుంది. గత 13 ఏళ్లుగా సినీరంగానికి దూరంగా ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతుంది. ఆమె ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాల్లోని పర్వాతాలలో నివసిస్తుంటారు.

Barkha Madan New

Barkha Madan New

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..