AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మీకు తెలుసా.. ఒకప్పుడు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో దివంగత హీరో ఉదయ్ కిరణ్ బ్లా్క్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Mahesh Babu, Uday Kiran
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 11:09 AM

Share

సాధారణంగా సినీరంగంలో ఒక హీరో కోసం రాసిన కథలు మరో నటుడి వద్దకు చేరుతుంటారు. ఒక హీరో చేయాల్సిన హిట్ మూవీ మరో హీరో ఖాతాలో పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు స్టార్స్ రిజెక్ట్ చేసిన చిత్రాలు మరో హీరోకు డిజాస్టర్ వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నాడు. ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ లవ్ స్టోరీ. కానీ ఆ చిత్రాన్ని మహేష్ బాబు రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. మనసంతా నువ్వే. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఉదయ్ కిరణ్ నటించిన ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర పై ఎంఎస్ రాజు నిర్మించగా.. వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇందులో రీమా సేన్ కథానాయికగా నటించగా.. చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా అప్పట్లో దాదాప 175 రోజుల వరకు విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అయ్యింది.

అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో మహేష్ బాబు. 2001లో ఎం.ఎస్ రాజు నిర్మాణంలో మహేష్ ఓ సినిమా చేయాలనుకున్నారట. అప్పుడే వి.ఎన్ ఆదిత్య చెప్పిన కథను మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. కానీ మనసంత నువ్వే కథను విన్న మహేష్ బాబు ఆ సమయంలో ఓ కమర్షియల్ మూవీ చేయాలనుకున్నారట. దీంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథకు మహేష్ బాబును ఎంపిక చేసుకున్నారు. మనసంత నువ్వే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఉదయ్ కిరణ్.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి