Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

సినీరంగంలో ఒకప్పుడు అతడు తోపు నటుడు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించారు. టాప్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో అలరించిన అతడు.. ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత అతడు ముంబైలోని ఓ అపార్ట్‏మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కనిపించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Savi Sidhu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2025 | 4:03 PM

సినీ పరిశ్రమలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని నిత్యం ఎంతోమంది ముంబైకి చేరుకుంటారు. ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు సొంతం చేసుకుంటారు. మరికొందరు మాత్రం జీవితాంతం ఆఫర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుని.. మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు.. ఆ తర్వాత తమ స్టార్ డమ్ కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటుడు కూడా అలాంటి జాబితాలోకి వచ్చినవారే. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్. కానీ ఇప్పుడు అవకాశాలు లేక ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అతడి పేరు సావి సిద్ధు. ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత ముఖ్య పాత్రలలో కనిపించాడు. కానీ ఇప్పుడు అతను అన్నింటినీ కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు.

సావి సిద్ధు.. లక్నోకు చెందిన అతడు మోడలింగ్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. లా చదువుతూనే అటు యాక్టింగ్ స్కిల్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. 1995లో తకాత్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాడు. చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ అతని నటనను గమనించి పాంచ్ కోసం సంప్రదించాడు. ఈ సినిమా విడుదల కాకపోయిన అతడి యాక్టింగ్ కశ్యప్ కు తెగ నచ్చేసింది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, గులాల్, పాటియాలా హౌస్, డేడి, బెవకూఫియాన్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు చివరగా బెవకూఫియాన్ సినిమాలో కనిపించాడు.

ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు ఐదేళ్లకు అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలాలో ఉన్న ఒక పెద్ద అపార్ట్‏మెంట్‎లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కనిపించాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు సినీ పరిశ్రమ వ్యక్తులు అతడు సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన భార్యను కోల్పోయిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా మరణించారని.. ఆ తర్వాత తన అత్తమామలు కూడా చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయానని.. ఇప్పుడు తాను ఒంటరిగానే ఉంటున్నానని తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులు తనను మరింత కృంగిపోయేలా చేశాయని.. అందుకే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని అన్నాడు.

Savi Sidhu Life

Savi Sidhu Life

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ