Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్రిద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
లేటేస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని.. సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని టాక్. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ తో కలిసి హీరోయిన్ కాజల్ స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరు కలిసి నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలు సూపర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపంచనుంది.
అయితే పెద్ది సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేయనుందనే విషయం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కాజల్.. ఇటీవలే సల్మాన్, రష్మిక కలిసి నటించిన సికందర్ మూవీలో కనిపించింది. అలాగే ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప మూవీలో పార్వతి పాత్రలో కనిపించనుంది కాజల్. అలాగే ఇప్పుడు పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ నడుస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :